Manase Chaalu / Track 07
మేలుకో నిత్యక్రాంతి
Meluko Nithyakranthi
Pre-save Manase Chaalu ↗
More ···
మేలుకో నీ దారి నువ్వు చూసుకో
మేలుకో ఈ మాయ లోకం వీడుకో
మేలుకో నీ గమ్యం ఎటో తెలుసుకో
మేలుకో ఇకనైనా మేలుకో
కాలం ఒక ప్రవాహములా సాగిపోద్ది
గాలం వేసి నిన్ను నువ్వు లాక్కోవద్ది
నీలోన వెలిగే ఆత్మజ్యోతి
నీలోన వెలిగే దివ్యకాంతి
నీలోన దొరికే అసలు శాంతి
నీలోన నిలిచే నిత్య క్రాంతి
మేలుకో నీ గమ్యం ఎటో తెలుసుకో
మేలుకో ఇకనైనా మేలుకో
లోలో ఉన్న వెలుగుని నువ్వు చూడలేవు
నీలో ఉన్న గర్వాన్ని నువ్వు వీడలేవు
రాయిలో ఉన్న శిల్పాన్ని నువ్వు చూడలేవు
తేనెలో ఉన్న విషాన్ని నువ్వు ఆపలేవు
మనసున ఉన్నది మణిదీపమయ్యా
తనవున ఉన్నది తత్వమయ్యా
కనరెవరు చెప్పని సత్యమయ్యా
వినవయ్యా ఇది నీ గమ్యమయ్యా
భానుడు ఎన్నడూ అస్తమించడు
భూమే తనను తాను తిప్పుకుంటూ చీకటిని వెతుకుతాడు
గర్వంతో నింగిని చూస్తూ నడిచేవాడు
నేలను మరచినా ఏదో ఒకనాడు తూలి పడతాడు
మేలుకో ఇకనైనా మేలుకో
మేలుకో నీ దారి నువ్వు చూసుకో
మేలుకో ఈ మాయ లోకం వీడుకో
మేలుకో నీ గమ్యం ఎటో తెలుసుకో
ఎందరో వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు
కొందరు నిట్టూర్పులతో మిగిలారు మరికొందరు పాటలై నిలిచిపోయారు
వారంతా ఒక క్షణపు కథలే కదా
నీవు కూడా ఆ కథలో చిన్న భాగమే కదా
నేడు నీతో ఉన్నావారు రేపు విడిపోవచ్చు
చూస్తుండగానే మాయమై పోవచ్చు
మేలుకో ఇకనైనా మేలుకో
మేలుకో నీ దారి నువ్వు చూసుకో
మేలుకో ఈ మాయ లోకం వీడుకో
మేలుకో నీ గమ్యం ఎటో తెలుసుకో
వెతుక్కో వెతుక్కో నీలో నువ్వు వెతుక్కో
అసలైన జ్ఞానపు వెలుగు నీలోనే ఉంది గ్రహించుకో
కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో
కళ్ళు తెరిచి చూడు ఇకనైనా మేలుకో
Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu