Manase Chaalu / Track 03

ఆకలన్న వాడికింత అన్నం పెట్టి చూడు

Aakalanna Vadikintha Annam Petti Choodu

Pre-save Manase Chaalu ↗
More ···
Share on WhatsApp ↗
రాతి గుడికి పరుగెందుకయ్యా నీ గుండె తలుపు కాస్త తీయవయ్యా రాతి గుడిలో దేవుణ్ణి వెతుకుతావు మట్టి బొమ్మల్లో ముక్తిని అడుగుతావు కల్మషం నిండిన మనసునే దాస్తావు కనిపించని దేవుడికై పరుగులు తీస్తావు ఉలిదెబ్బ తిన్న రాయికి పూజలు చేశావు నిప్పుల్లో కాలిన లోహాన్ని దేవుడిగా మలిచావు అసలైన ఆలయం హృదయమేనని మరిచావు కనులు మూసుకుని గుడిబాట పట్టావు కోపాలు తాపాలు గుండెల్లో దాచుకున్నావు ఈర్ష్యలు ద్వేషాలు నరనరాన నింపుకున్నావు విశ్వమంతా ఉన్నవాణ్ణి గుడిలోన బంధించావు కళ్లముందు మనుషుల్ని కాదనుకుని పోయావు రాతి గుడిలో దేవుణ్ణి వెతుకుతావు మట్టి బొమ్మల్లో ముక్తిని అడుగుతావు కల్మషం నిండిన మనసునే దాస్తావు కనిపించని దేవుడికై పరుగులు తీస్తావు మట్టి బొమ్మకు దణ్ణాలు పెట్టావు నీలోని దేవుణ్ణి మర్చిపోయావు ఆకలన్న వాడికింత అన్నం పెట్టి చూడు కన్నీరు తుడిచే చేతిలో ఆ దేవుడుంటాడు చూడు నిన్ను నువ్వు తెలుసుకునే జ్యోతిని వెలిగించి చూడు మనసునే గుడిగా మలిస్తే పలికేను దైవం చూడు రాతి గుడిలో దేవుణ్ణి వెతుకుతావు మట్టి బొమ్మల్లో ముక్తిని అడుగుతావు కల్మషం నిండిన మనసునే దాస్తావు కనిపించని దేవుడికై పరుగులు తీస్తావు నీలోనే ఉన్నాడు చూడు నీతోనే ఉన్నాడు చూడు

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu