Manase Chaalu / Track 06
జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి
Janana Maranala Madhyana Saageti Baatasaari
Pre-save Manase Chaalu ↗
More ···
Hey
Ohhh oooo hmmm
జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి
అంతుచిక్కని ఈ సృష్టిలో నువ్వొక సంచారి
జగమనే నాటక రంగంలో నువ్వొక పాత్రధారి
శోకాన మునిగినా సాగాలి ఈ జీవన దారి
నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం
గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం
కర్మ నడిపించేటి నాటకమే కాలం
శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం
Ohhh oooo hmmm
కష్టాల కడలిలో ఈదుతూ సాగాలి
నష్టాల బాటలో పాఠాలు నేర్వాలి
కోటల్లే నిలవాలి నీలోని ధైర్యం
బాటల్లే మారాలి రేపటి లక్ష్యం
మన్నైన దేహాన మిగిలేది మౌనం
కర్మే చూపేను కడతేరు మార్గం
Ohhh oooo hmmm
జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి
అంతుచిక్కని ఈ సృష్టిలో నువ్వొక సంచారి
నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం
గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం
కర్మ నడిపించేటి నాటకమే కాలం
శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం
Ohhh oooo hmmm
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే ఈ కాయం
చుట్టినా రాదులే ఏనాడు ఏ సాయం
ఆశల వలలలో చిక్కుకున్న హృదయం
శ్వాసలో వెతకాలి శాశ్వత ఉదయం
మాయా లోకంలో నీవు ఒక బాటసారి
కామ్యాలు వీడితే కనుగొనుము దారి
Ohhh oooo hmmm
గెలుపు నీది కాదు ఓటమి నీది కాదు
సమయం నీది కాదు కాలం నీతో రాదు
అంతా మాయ జగమంతా మాయ
అంతా మాయ జగమంతా మాయ
అంతా మాయ
Ohhh oooo hmmm
జగమనే నాటక రంగంలో నువ్వొక పాత్రధారి
శోకాన మునిగినా సాగాలి ఈ జీవన దారి
నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం
గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం
కర్మ నడిపించేటి నాటకమే కాలం
శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం
జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి
జ్ఞానం శాంతం మౌనం
Ohhh oooo hmmm
Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu